క్వార్టర్స్‌ అడ్డంకిని దాటలేకపోయారు..

10 Jan, 2020 16:57 IST|Sakshi

కౌలాలంపూర్‌:  మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో భారత్‌ కథ ముగిసింది. ఈరోజు(శుక్రవారం) జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు ఓటమి పాలయ్యారు. వీరిద్దరూ క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటి దారి పట్టడంతో భారత్‌ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు 16-21, 17-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం చెందగా,  సైనా నెహ్వాల్‌ 8-21, 7-21 తేడాతో మాజీ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓటమి చెందారు.

ఈ సీజన్‌ ఆరంభపు టోర్నీని ఘనంగా ఆరంభించాలని చూసిన  సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు క్వార్టర్స్‌ అడ్డంకిని దాటలేకపోయారు. ఇది తై జు యింగ్‌ చేతిలో సింధుకు వరుసగా రెండో పరాజయం. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధును తై జు యింగ్‌ ఓడించారు.  తై జు యింగ్‌ తాజా విజయంతో ముఖాముఖి రికార్డును 12-5 తేడాతో మరింత పెంచుకుంది. ఇక సైనా నెహ్వాల్‌ అరగంటలోనే చేతులెత్తేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రోహిత్‌తో మాట్లాడా.. కానీ క్రికెట్‌ గురించి కాదు’

ఉత్కంఠ పోరు.. కాట్రెల్‌ ఫినిషింగ్‌ అదుర్స్‌

అవుటా... నాటౌటా! 

పాకిస్తాన్‌ ఇప్పుడు సురక్షితమైన ప్రదేశం : గేల్‌

నా చేతుల్లో ఏమీ లేకపోయింది: హార్దిక్‌

సినిమా

ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌: బన్నీ కొడుకు

ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. : బన్నీ

కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు: అనుష్క

దీపికకు రణ్‌వీర్‌ భావోద్వేగ లేఖ!

‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. లవ్‌ యూ ఎవర్‌’

రే... నువ్వు అత్యంత అద్భుతమైన వ్యక్తివి!