సింధు సత్తాకు పరీక్ష

11 Dec, 2019 01:46 IST|Sakshi

నేటి నుంచి వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ

గ్వాంగ్‌జౌ (చైనా): గత ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్‌ గెలిచాక... భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆడిన ఆరు టోర్నీల్లో కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ దశ దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో టైటిల్‌ నిలబెట్టుకొని ఈ ఏడాదిని ఘనంగా ముగించాలనే లక్ష్యంతో సింధు ఉంది. వాస్తవానికి వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీకి సూపర్‌ టోర్నీల ర్యాంకింగ్స్‌లో టాప్‌–8లో ఉన్నవారికి మాత్రమే అవకాశం లభిస్తుంది. టాప్‌–8లో సింధు లేకపోయినా ప్రపంచ చాంపియన్‌ హోదాలో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడేందుకు అవకాశమిచ్చారు. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సింధుకు మెరుగైన రికార్డు ఉంది. 2017లో ఆమె రన్నరప్‌గా నిలువగా... 2018లో విజేతగా అవతరించింది.

ఈసారి సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’లో సింధుతోపాటు ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌), రెండో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా), ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా) ఉన్నారు. నేడు జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో యామగుచితో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 10–6తో ఆధిక్యంలో ఉంది. గ్రూప్‌ ‘బి’లో నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), ప్రపంచ మాజీ చాంపియన్స్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌),  ఒకుహారా (జపాన్‌), బుసానన్‌ (థాయ్‌ లాండ్‌) ఉన్నారు. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌ ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 14న సెమీఫైనల్స్, 15న ఫైనల్స్‌ జరుగుతాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌ ‘టాప్‌’ లేపింది

పట్టాలి... క్యాచుల్ని, సిరీస్‌ని!

శాంసన్‌కు నో ఛాన్స్‌.. శశిథరూర్‌ ట్వీట్‌

అ​య్యర్‌కు పీటర్సన్‌ చిన్న సలహా!

‘మేం ఎక్కడికీ రాం.. మీరే ఇక్కడికి రావాలి’

మేం ఎవరికీ భయపడం: రోహిత్‌

‘గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ 2019’ ఇదే..

‘నా ప్రయాణం ముగిసింది’.. దరిద్రం పోయింది

గాయం తగ్గలేదు.. అతను ఆడటం డౌటే..!

సిగ్గుందా: పాక్‌ క్రికెటర్‌పై నెటిజన్ల ఫైర్‌!

అప్పటి నుంచి టాప్‌–5లోనే...

‘స్వర్ణ’ సాత్విక

ఆంధ్ర 211 ఆలౌట్‌

ఒలింపిక్స్ నుంచి రష్యాను గెంటేశారు

ఇండియన్‌ ఆర్మీపై ఎంఎస్‌ ధోని టీవి షో..!

రష్యాకు బిగ్ షాక్‌: ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌!

వీరిద్దరి ప్రేమాయాణం నిజమేనా?

ఇలాగైతే ఎన్ని పరుగులు చేసినా వేస్ట్‌!

మైదానంలో పాము.. నిలిచిపోయిన మ్యాచ్‌

శ్వేతను పెళ్లాడిన సాయిప్రణీత్‌

విరాట్‌ కోహ్లి.. స్టన్నింగ్‌ క్యాచ్‌!

సరైన వయసు చెప్పండ్రా బాబు..! 

శభాష్‌ మానస్‌ 

రంజీ సమరానికి వేళాయె

విజేత భారత్‌  

అదే  జోరు...

టీమిండియాకు భంగపాటు

గెలిచి సమం చేశారు..

హ్యాట్రిక్‌ నంబర్‌ 35

వెస్టిండీస్‌ లక్ష్యం 171

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాగుంది అంటే చాలు

కాలేజ్‌కి వెళ్లాను – రాజేంద్ర ప్రసాద్‌

మేం విడిపోయాం

ఈ సినిమాతో క్లారిటీ వచ్చింది – కార్తికేయ

ముఖాన్ని నాశనం చేశాడు... నా ఆత్మవిశ్వాసాన్ని కాదు

మిస్సయ్యారు