‘భారత్‌ లక్ష్మీ’పై క్రీడాకారిణుల హర్షం 

27 Oct, 2019 09:03 IST|Sakshi

ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన పీవీ సింధు, నిఖత్‌ జరీన్‌

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘భారత్‌ లక్ష్మీ’ కార్యక్రమం పలువురు స్టార్‌ మహిళా క్రీడాకారిణుల మనసును తాకిం ది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు, బాక్సర్లు మేరీకోమ్, నిఖత్‌ జరీన్, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మని కా బాత్రా, రెజ్లర్‌ పూజ ట్విట్టర్‌ వేదికగా ‘భారత్‌ లక్ష్మీ’ కార్యక్రమానికి తమ మద్దతును ప్రకటించారు. ‘ఈ చర్య అమ్మాయిలు తమ రంగాల్లో మరింతగా రాణించేందుకు ప్రేరణ ఇస్తుంది.

మహిళా సాధికారత దిశగా ప్రోత్సహిస్తుంది. భారత్‌ లక్ష్మీ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అంటూ వారు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలు పంచుకున్నా రు. అమ్మాయిల్ని సాక్షాత్తు లక్ష్మీ దేవిగా భావిం చే మన దేశంలో వేర్వేరు రంగాల్లో గొప్ప ఘనతలు సృష్టించిన మహిళలను ఈ దీపావళి సందర్భంగా తగిన విధంగా గౌరవించండంటూ ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ‘భారత్‌ లక్ష్మీ’ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు