ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా.. సింధు!

7 Aug, 2019 14:40 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు సంపాదన పరంగా చరిత్ర సృష్టించారు.  మంగళవారం విడుదల చేసిన 2019 ఫోర్బ్స్‌ టాప్‌-15లో చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా ఘనత సాధించారు. సింధు 5.5 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో  13వ స్థానాంలో నిలిచారు. ఈ ఆదాయం అంతా ఆమె ప్రకటనలు, వేతనం, ప్రోత్సాహకాల ద్వారా లభించింది. సింధు భారత మహిళా అథ్లెట్స్‌లో ప్రభావవంతమైన క్రీడాకారిణి అని, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ  2018లో సింధు విజేతగా నిలవడంతో అభిమానుల్లో ఆమెకు మరింత క్రేజ్‌ పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఇక గతేడాది విడుదల చేసిన ఫోర్బ్స్‌ జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

కాగా ఈ ఏడాది మహిళా అథ్లెట్లలో అత్యంత సంపన్నరాలిగా  అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా  విలియమ్సన్‌ నిలిచారు. సెరెనా సంపద 29.2 మిలియన్‌ డాలర్లు. గతేడాది వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సింధు అంచనాలకు మించి ఆడటం లేదు. ఇండోనేసియా టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోవడంతో సహా.. సింగపూర్‌, మలేసియా, జపాన్‌, జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణమే లక్క్ష్యంగా సింధు బరిలోకి దిగుతోంది. 

మరిన్ని వార్తలు