సఫారీలు అలవోకగా..

2 Oct, 2016 02:16 IST|Sakshi
సఫారీలు అలవోకగా..

తొలి వన్డేలో ఆసీస్‌పై విజయం 

 సెంచూరియన్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా సునాయాసంగా అధిగమించింది. ఓపెనర్ డి కాక్ (113 బంతుల్లోనే 178; 16 ఫోర్లు, 11 సిక్సర్లు)  విధ్వంసక శతకం సహాయంతో 295 పరుగుల లక్ష్యాన్ని 36.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోరుు ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 294 పరుగులు చేసింది.

జార్జి బెరుులీ (90 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), హేస్టింగ్‌‌స (56 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. పేసర్ ఫెలుక్‌వాయో నాలుగు, స్టెరుున్ రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన డి కాక్ ప్రత్యర్థి బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 74 బంతుల్లోనే శతకం సాధించాడు. ఆ తర్వాత మరింత దూకుడుతో స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 101 బంతుల్లో 150 పరుగుల మార్క్ చేరిన డికాక్... 34వ ఓవర్‌లో వెనుదిరిగాడు. రోసో (63) అర్ధ సెంచరీ చేయగా.. పేసర్ బోలండ్‌కు మూడు వికెట్లు దక్కారుు.

మరిన్ని వార్తలు