'ఎవ్వరికీ అంతు చిక్కని బౌలర్ అతను'

25 Dec, 2016 12:17 IST|Sakshi
'ఎవ్వరికీ అంతు చిక్కని బౌలర్ అతను'

ముంబై: భారత క్రికెట్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్పై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురింపిచాడు. రోజు రోజుకీ పరిణితి చెందుతున్న అశ్విన్ చాలా తెలివైన క్రికెటరే  కాకుండా, బ్యాటింగ్ లో సమయోచిత టెక్నిక్ను కల్గిన ఆటగాడని బంగర్ కొనియాడాడు. ఎప్పుడూ తన టెక్నిక్ను మెరుగుపరుచుకోవడానికి అత్యంత ఉత్సుకత చూపించడమే అశ్విన్ ను నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిందన్నాడు.

'అశ్విన్ చాలా తెలివైన క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అణుకువుగా ఉంటూ తన సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి అశ్విన్ ఎక్కువ కృషి చేస్తాడు. అదే అతన్ని ఉన్నత స్థానంలో నిలిపింది. ప్రస్తుతం టెక్నిక్ పరంగా ఎంతో మెరుగ్గా ఉన్న అశ్విన్ ను కట్టడి చేయడమంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు  అంత  సులువు కాదు. ఒక ఆటగాడ్ని ఊపిరిపీల్చుకోకుండా చేసే టెక్నిక్ అశ్విన్ సొంతం. ఒకవేళ అశ్విన్ బౌలింగ్లో ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తే వికెట్ను సమర్పించుకోవాల్సిఉంటుంది. అవతలి జట్టు స్పిన్నర్లకు కూడా అశ్విన్ బౌలింగ్ను అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఎవరికీ అంతుచిక్కని బౌలర్ అశ్విన్.దాంతో పాటు బ్యాటింగ్ లో  అశ్విన్ టెక్నిక్ చాలా మెరుగ్గా ఉంది' అని బంగర్ పేర్కొన్నాడు.

కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అశ్విన్ గెలుచుకున్నాడు. ఈ ఏడాది 72 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న అశ్విన్, 612 పరుగులు నమోదు చేసి 'బెస్ట్'గా నిలిచాడు.

మరిన్ని వార్తలు