నాదల్‌దే పైచేయి 

28 Jan, 2020 04:52 IST|Sakshi

కిరియోస్‌పై గెలుపుతో క్వార్టర్‌ ఫైనల్లోకి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: మైదానం బయట తరచూ తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసే ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిరియోస్‌తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ పైచేయి సాధించాడు. 3 గంటల 38 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ నాదల్‌ 6–3, 3–6, 7–6 (8/6), 7–6 (7/4)తో 23వ సీడ్‌ కిరియోస్‌ను ఓడించి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాదల్‌ డజన్‌ ఏస్‌లు సంధించి 64 విన్నర్స్‌ కొట్టాడు.

తాజా విజయంతో కిరియోస్‌తో ముఖాముఖి రికార్డులో నాదల్‌ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో థీమ్‌ 6–2, 6–4, 6–4తో పదో సీడ్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై, ఏడోసీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–4, 6–4, 6–4తో 17వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)పై, 15వ సీడ్, మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6–2, 2–6, 4–6, 7–6 (7/2), 6–2తో నాలుగో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా)పై విజయం సాధించారు.

కెర్బర్‌ ఓటమి...
మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ హలెప్‌ 6–4, 6–4తో మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై.. ముగురుజా 6–3, 6–3తో తొమ్మిదో సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌)పై... పావ్లీచెంకోవా 6–7 (5/7), 7–6 (7/4), 6–2తో 2016 చాంపియన్‌ కెర్బర్‌ (జర్మనీ)పై... కొంటావీట్‌ 6–7 (4/7), 7–5, 7–5తో ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)పై గెలుపొందారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు