బ్యూనోస్ ఎయిర్స్:అర్జెంటీనా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ రఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో నాదల్ 7-6(7/3), 6-2 తేడాతో పాలో లోరెంజి(ఇటలీ)పై విజయం సాధించి సెమీస్ కు చేరాడు. తన మునపటి ఫామ్ ను చాటుకుంటూ సెమీస్‌లోకి ప్రవేశించాడు.
తొలి సెట్లో లొరెంజీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా నాదల్ శ్రమించి గెలిచాడు. టైబ్రేక్‌కు దారి తీసిన ఆ సెట్లో నాదల్ ఏడు పాయింట్లతో పైచేయి సాధించగా, లోరెంజీ మూడు పాయింట్లతో ఆ సెట్ ను కోల్పోయాడు. అనంతరం రెండో సెట్లో నాదల్ రెచ్చిపోయాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించి ఆ సెట్ ను కైవసం చేసుకున్నాడు.ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ లో తొలి రౌండ్లో ఓటమి పాలైన అనంతరం నాదల్ పాల్గొన్న మొదటి టోర్నీ ఇదే.