'అతని వల్ల అదనపు బౌలర్ కు అవకాశం'

26 Jun, 2017 14:45 IST|Sakshi
'అతని వల్ల అదనపు బౌలర్ కు అవకాశం'

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెనర్ అజింక్యా రహానేపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక టెస్టు బ్యాట్స్మన్ గా గుర్తింపు పొందిన రహానే.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో సైతం తనదైన ముద్రతో దూసుకుపోతున్నాడని కొనియాడాడు.  'ఈ సిరీస్ లో రహానే బ్యాటింగ్ చూడండి.. అద్భుతంగా ఉంది. ప్రధానంగా వన్డే సిరీస్లకు తగ్గట్టుగా రహానే బ్యాటింగ్ సాగుతోంది. మాకు మూడో ఓపెనింగ్ బ్యాట్స్మన్ రహానే రూపంలో ఉండటం జట్టు బలాన్ని తెలియజేస్తుంది. రహానే ఎప్పుడూ పెద్దగా ఒత్తిడి తీసుకోకుండానే ఆడతాడు. ముఖ్యంగా గేమ్ను ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేయడం రహానేలో నాకు కనబడిన లక్షణం.

భారత జట్టు సమతుల్యంగా ఉండటానికి రహానే పాత్ర కూడా కారణం. వరల్డ్ కప్ వంటి మేజర్ టోర్నీల్లో ఆడేటప్పుడు అదనపు బ్యాట్స్ మన్ గురించి కాకుండా అదనపు బౌలర్ గురించి ఆలోచించే పరిస్థితిని రహానే కల్పించాడు. అతని వల్ల అదనంగా ఒక బౌలర్ ను జట్టు వెంట ఎటువంటి సంకోచం లేకుండా తీసుకెళ్లవచ్చు. విండీస్ పర్యటనకు 15 మంది ముఖ్యమైన ఆటగాళ్లతో వెళ్లాం. స్వదేశంలో మరో 10 నుంచి 12 మంది ఆటగాళ్ల కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా టెస్టింగ్ ప్రాసెస్ లో ఉన్నారు. ఒత్తిడిలో ఎలా ఆడతారు అనే దానిపై వారిని పరిశీలిస్తున్నాం'అని కోహ్లి పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు