33 నెలలు తర్వాత తొలి స్పిన్నర్‌గా రికార్డు

29 Nov, 2019 11:00 IST|Sakshi

లక్నో: వెస్టిండీస్‌ స్పిన్నర్‌, భారీ స్థూలకాయ క్రికెటర్‌ రాకిమ్‌ కార్న్‌వాల్‌ అరుదైన రికార్డును సాధించాడు. లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్లు సాధించి విండీస్‌ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన రాకిమ్‌.. ఆ దేశం తరఫున ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన 7 స్పిన్నర్‌గా నిలిచాడు. అదే సమయంలో భారత్‌లో 33 నెలల తర్వాత ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన తొలి స్పిన్నర్‌గా రికార్డును నమోదు చేశాడు. 2017 ఫిబ్రవరిలో పుణెలో భారత్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్‌ స్టీవ్‌ ఓకీఫ్‌ 12 వికెట్లను సాధించగా, ఆ తర్వా ఇంతకాలానికి భారత్‌ వేదికగా 10 వికెట్ల మార్కును చేరిన స్పిన్నర్‌గా రాకిమ్‌ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.

2016లో  ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా రవి చంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు ఒక టెస్టులో 10 వికెట్లను సాధించారు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో ఓకీఫ్‌ 10 వికెట్లకు పైగా సాధించి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మళ్లీ ఇప్పుడు రాకిమ్‌ 10 వికెట్లతో మెరిసి విండీస్‌ గెలుపులో అతి పెద్ద పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రాకిమ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 9 వికెట్ల తేడాతో  విజయం నమోదు చేసింది. అఫ్గాన్‌ 31 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగా, దాన్ని 6.2 ఓవర్లలో విండీస్‌ ఛేదించింది. . క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(8) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, క్యాంప్‌బెల్‌(19 నాటౌట్‌), షాయ్‌ హోప్‌(6 నాటౌట్‌)లు మరో వికెట్‌ పడకుండా విండీస్‌కు గెలుపును అందించారు.

అఫ్గాన్‌ 31 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 6.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(8) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, క్యాంప్‌బెల్‌(19 నాటౌట్‌), షాయ్‌ హోప్‌(6 నాటౌట్‌)లు మరో వికెట్‌ పడకుండా విండీస్‌కు విజయాన్ని అందించారు. దాంతో విండీస్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  అఫ్గాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌట్‌ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది. వెస్టిండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో  277 పరుగులకు ఆలౌటైంది. 

మరిన్ని వార్తలు