కార్న్‌వాల్‌కు 7 వికెట్లు

28 Nov, 2019 05:45 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌ 187 ఆలౌట్‌

వెస్టిండీస్‌తో ఏకైక టెస్టు

లక్నో: ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రాకిమ్‌ కార్న్‌వాల్‌ తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. అఫ్గానిస్తాన్‌తో బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్టులో కార్న్‌వాల్‌ 75 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అఫ్గాన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌటైంది. జావేద్‌ అహ్మదీ (39), అమీర్‌ హమ్జా (34), అఫ్సర్‌ జజాయ్‌ (32) ఫర్వాలేదనిపించారు. హోల్డర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం విండీస్‌ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (11), షై హోప్‌ (7) విఫలం కాగా... క్యాంప్‌బెల్‌ (30 బ్యాటింగ్‌), బ్రూక్స్‌ (19 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం విండీస్‌ మరో 119 పరుగులు వెనుకబడి ఉంది. భద్రతాకారణాలరీత్యా అఫ్గానిస్తాన్‌ తమ దేశంలో కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లను భారత్‌ కేంద్రంగా ఆడుతోంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా