దీటుగా బదులిస్తున్న అఫ్గాన్‌

4 Jul, 2019 20:48 IST|Sakshi

లీడ్స్‌: వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌ జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ దీటుగా బదులిస్తోంది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ నిలకడగా ఆడుతోంది. 21 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 109 పరుగులు చేసింది. రహ్మత్‌ షా, ఇక్రమ్‌ అలీ ఖిల్‌లు హాఫ్‌ సెంచరీలు సాధించారు. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ ఆదిలోనే కెప్టెన్‌ గుల్బదీన్‌ నైబ్‌(5) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రహ్మత్‌ షాకు జత కలిసిన వికెట్‌ కీపర్‌ ఇక్రమ్‌ అలీ ఖిల్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. విండీస్‌ పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ అర్థ శతకాలతో మెరిశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది.  విండీస్‌ ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(58; 78 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్‌ హోప్‌(77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మెయిర్‌(39; 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్‌(58; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌), హోల్డర్‌(45; 34 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.


 

మరిన్ని వార్తలు