కోహ్లిని దాటేసిన రాహుల్‌

2 Feb, 2020 13:41 IST|Sakshi

రోహిత్‌ శర్మ మళ్లీ బాదేశాడు..

మౌంట్‌మాంగనీ:  న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ మరో హాఫ్‌ సెంచరీ సాధించాడు. మూడో టీ20లో హాఫ్‌ సెంచరీ సాధించిన రోహిత్‌.. చివరిదైన ఐదో టీ20లో కూడా అర్థ శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన రోహిత్‌ శర్మ బాధ్యతాయుతంగా ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో లీడింగ్‌ స్కోరర్‌గా ఉన్న రాహుల్‌..బెన్నెట్‌ వేసిన 12 ఓవర్‌ మూడో బంతికి పెవిలియన్‌ చేరాడు. షాట్‌ ఆడదామని రాహుల్‌ యత్నించగా అది ఎడ్జ్‌ తీసుకుని సాన్‌ట్నర్‌ చేతుల్లోకి వెళ్లింది. దాంతో రాహుల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా జట్టు స్కోరు 96 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. అటు తర్వాత అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించే క్రమంలో రోహిత్‌ అర్థ శతకం సాధించాడు. కాగా, రోహిత్‌ 60  పరుగుల వద్ద ఉండగా కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాడు.

కోహ్లిని దాటేసిన రాహుల్‌
ఇటీవల కాలంలో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఒక అరుదైన మైలురాయిని నమోదు చేశాడు. ఒక ద్వైపాక్షిక అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లిని రాహుల్‌ అధిగమించాడు. 2016లో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో కోహ్లి 199 పరుగులు చేయగా, దాన్ని రాహుల్‌ బ్రేక్‌ చేశాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌ 224 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున తొలి నాలుగు స్థానాల్లో రాహుల్‌, కోహ్లిలే ఉండటం ఇక్కడ విశేషం. 2019లో జరిగిన మూడు టీ20 సిరీస్‌లో కోహ్లి 183 పరుగులు చేయగా, అదే సిరీస్‌లో రాహుల్‌ 164 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో తొలి నాలుగు స్థానాలు వీరి పేరిటే ఉన్నాయి. (ఇక్కడ చదవండి: రాస్‌ టేలర్‌కు ‘వంద’నం)

>
మరిన్ని వార్తలు