కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత

18 Jan, 2020 09:35 IST|Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో రాణించిన రాహుల్‌.. వన్డే ఫార్మాట్‌లో వెయ్యి పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన నాల్గో భారత ఆటగాడిగా నిలిచాడు. రాహుల్‌ 27 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ సాధించగా, కోహ్లి, ధావన్‌(24 మ్యాచ్‌ల్లో) వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లు. ఈ జాబితాలో నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ(25) మ్యాచ్‌ల్లో వెయ్యి వన్డే పరుగుల్ని సాధించాడు. ఇక భారత్‌ తరఫున వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ గుర్తింపు పొందాడు. 58వ మ్యాచ్‌ల్లో కుల్దీప్‌ 100 వికెట్ల మార్కును చేరుకున్నాడు. భారత్‌ తరఫున వేగవంతంగా వంద వన్డే వికెట్లు సాధించిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కుల్దీప్‌ కంటే ముందు షమీ(56), బుమ్రా(57)లు ఉన్నారు. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాపై వన్డేల్లో 300 అంతకంటే ఎక్కుక స్కోరు చేయడం భారత్‌కు ఇది 25వసారి. (ఇక్కడ చదవండి: వ్యూహం మార్చి అదరగొట్టారు)

రెండో వన్డేలో  భారత్‌  36 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా విధించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్‌ చతికిలపడింది. ఆసీస్‌ బ్యాట్సమెన్లలో స్టీవ్‌ స్మిత్(102 బంతుల్లో 98 పరుగులు)‌, లబుషేన్‌( 47 బంతుల్లో 46 పరుగులు)తో కొంత ప్రతిఘటించినా తర్వాత వచ్చిన బ్యాట్సమెన్‌ విఫలం కావడంతో 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 340 పరుగులు సాధించింది. శిఖర్‌ ధావన్‌(96; 90  బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించి భారత్‌కు భారీ స్కోరు సాధించి పెట్టారు. (ఇక్కడ చదవండి: వాటే స్పెల్‌ బుమ్రా..)

>
మరిన్ని వార్తలు