ద్రవిడ్ వల్లే పరిణతి చెందా: వాట్సన్

13 May, 2014 01:16 IST|Sakshi
ద్రవిడ్ వల్లే పరిణతి చెందా: వాట్సన్

బెంగళూరు: రాజస్థాన్ రాయల్స్ టీమ్ మెంటర్ రాహుల్ ద్రవిడ్ వల్లే ఓ క్రికెటర్‌గా అన్ని విభాగాల్లో పరిణతి చెందినట్టు ఆ జట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. ‘ద్రవిడ్‌లాంటి వ్యక్తి మెంటర్‌గా ఉండడం అనేది అత్యద్భుతమైన విషయం. అతడు మా జట్టులో ఉండబట్టే నేను అత్యంత స్వల్ప కాలంలోనే అభివృద్ధి చెందగలిగాను. వ్యక్తిగతంగానైతే నాకు అతని సాన్నిహిత్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో ద్రవిడ్‌తో కలిసి ఆడడం నాకు దక్కిన గౌరవం. ఇక ఫాల్క్‌నర్ బెంగళూరుతో ఆడిన ఇన్నింగ్స్‌లాగే గతంలోనూ ఆసీస్ తరఫున పలుమార్లు ఆడాడు. అతను నిలకడైన ఆల్‌రౌండర్‌గా రూపుదిద్దుకోవడం మంచి పరిణామం’ అని వాట్సన్ తెలిపాడు. ఐపీఎల్‌లో ఆసీస్ ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నా ఐసీసీ టి20 టోర్నీల్లో మాత్రం తేలిపోవడం బాధ కలిగిస్తోందని చెప్పాడు.

మరిన్ని వార్తలు