ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్కే దక్కాలి!

11 Jan, 2017 12:42 IST|Sakshi
ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్కే దక్కాలి!

ముంబై: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా-ఏపై ఇంగ్లండ్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బ్యాటింగ్ చేసిన స్యామ్‌ బిల్లింగ్స్‌ (85 బంతుల్లో 93; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ కీలక ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బిల్లింగ్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. తన ఆటతీరుకు తమ మెంటర్ రాహుల్ ద్రవిడ్ కారణమని చెప్పాడు. గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటర్ గా ఉన్న ద్రవిడ్ తన బ్యాటింగ్ టెక్నిక్స్ ను మెరుగు పరిచారని తెలిపాడు.

'బ్యాటింగ్ లో ముఖ్యంగా ఫుట్ వర్క్ సమస్యను అధిగమించాను. గతంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సమస్యలుండేవి. అయితే ద్రావిడ్ కోచింగ్ తో ఈ సమస్యలను అధిగమించాను. అశ్విన్, జడేజాలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు' అని బిల్లింగ్స్ కితాబిచ్చాడు. మొత్తానికి ఈ క్రెడిట్ అంతా ద్రావిడ్ దేనని చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్.. ధోనీకి ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా అభిమానులు ఉన్నారని వివరించాడు.

మరిన్ని వార్తలు