బ్యాటింగ్లోనూ మెరిశారు..

16 Jul, 2016 18:29 IST|Sakshi
బ్యాటింగ్లోనూ మెరిశారు..

సెయింట్ కిట్స్: విండీస్ బోర్డు ఎలెవన్ జట్టుతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. తొలుత బౌలింగ్లో ఆకట్టుకున్న భారత జట్టు.. ఆ తరువాత బ్యాటింగ్లో కూడా సత్తాచాటింది. శుక్రవారం రాత్రి జరిగిన రెండో రోజు ఆటలో  కేఎల్ రాహుల్(64 రిటైర్డ్ అవుట్;127 బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్స్),విరాట్ కోహ్లి(51;94 బంతుల్లో 4 ఫోర్లు), రవీంద్ర జడేజా(56;61 బంతుల్లో 8 ఫోర్లు)లు ఆకట్టుకున్నారు.  మిగతా ఆటగాళ్లలో మురళీ విజయ్(23), చటేశ్వర పూజారా(28),అజింక్యా రహానే(32), సాహా(31), అశ్విన్(26)లు ఫర్వాలేదనిపించడంతో భారత జట్టు  తన తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగుల వద్ద ఆలౌటయ్యింది.

 

ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ రెండో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 158 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు విండీస్ బోర్డు ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు చాపచుట్టేసిన సంగతి తెలిసిందే.  భారత స్నిన్ త్రయం రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలు రాణించి విండీస్ యువ జట్టును కట్టడి చేశారు. అశ్విన్,  జడేజాలు తలో మూడు వికెట్లు సాధించగా,  అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు.

>
మరిన్ని వార్తలు