కోహ్లిపై అభిమానుల ఆగ్రహం!

18 Jul, 2018 10:54 IST|Sakshi
కేఎల్‌ రాహుల్‌, కోహ్లి (ఫైల్‌ ఫొటో)

లీడ్స్‌ : ఇంగ్లండ్‌తో సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో కేఎల్‌ రాహుల్‌ను తప్పిస్తూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్లతో ఓడి సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కెప్టెన్‌ కోహ్లి నిర్ణయమే కారణమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు వన్డేల్లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ దారుణంగా విఫలమవడంతో ఈ మ్యాచ్‌కు కోహ్లిసేన ఒక మార్పుతో బరిలోకి దిగింది. కేఎల్‌ రాహుల్‌కు బదులు దినేశ్‌ కార్తీక్‌ జట్టులోకి వచ్చాడు. అయితే ఇదా చాలా తప్పుడు నిర్ణయమని నెటిజన్లు మండిపడుతున్నారు.

తొలి టీ20లో సెంచరీతో ఆకట్టుకున్న కేఎల్‌ రాహుల్‌ను పక్కన బెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రోహిత్‌కు ఏమో చాలా అవకాశాలు ఇస్తారని, రాహుల్‌కు మాత్రం అవకాశలివ్వకుండా జట్టులో నుంచి తీసేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. అంతలా కార్తీక్‌ అవకాశం కల్పించాలనుకుంటే మహేంద్ర సింగ్‌ ధోనిని తీసేయాల్సిందని, మ్యాచ్‌ విన్నర్‌ను తీసేసి, మ్యూచ్‌ లూజర్‌ను ఆడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇంకొందరు రైనాను తీసేయల్సిందని అభిప్రాయపడుతున్నారు.

ఇది వ్యూహాత్మాక మార్పు: కోహ్లి
కేఎల్‌ రాహుల్‌ను తప్పించడంపై కోహ్లి మ్యాచ్‌ అనంతరం స్పందించాడు. ‘  వ్యూహాత్మక మార్పులో భాగంగానే దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇచ్చాం. మాకు మిడిల్‌ ఓవర్స్‌ను సమర్దవంతంగా ఎదుర్కునే బ్యాట్స్‌మన్‌ కావాలి. ఆ స్థానంలో కార్తీక్‌ గతంలో రాణించాడు. అందుకే అతనికి అవకాశం ఇచ్చాం’ అని పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సైతం వచ్చే ప్రపంచకప్‌ దృష్ట్యా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షిస్తున్నామని తెలిపాడు.

చదవండి: ఆ బంతికి బిత్తరపోయిన కోహ్లి

మరిన్ని వార్తలు