‘మోరే క్యాచ్‌ వదిలేస్తే.. గూచ్‌ ట్రిపుల్‌ సెంచరీ కొట్టాడు’

22 Jun, 2020 14:42 IST|Sakshi

వికెట్‌ కీపింగ్‌ అంటే అంత ఈజీ కాదు

కేఎల్‌ రాహుల్‌కు టెస్టు గ్లౌవ్స్‌ ఇవ్వొద్దు

మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచన

న్యూఢిల్లీ: భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాత్కాలిక వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేఎల్‌ రాహుల్‌ను టెస్టు ఫార్మాట్‌లో మాత్రం కీపర్‌గా కొనసాగించవద్దని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. వికెట్‌ కీపింగ్‌ పాత్ర అనేది చాలా భిన్నమైనదని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీపింగ్‌కు, టెస్టు మ్యాచ్‌ల్లో కీపింగ్‌కు చాలా ఉంటుందన్నాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అత్యంత ఓపిగ్గా ప్రతీ బంతిని ఫోకస్‌ చేయాల్సి ఉంటుందన్న చోప్రా.. ఈ ఫార్మాట్‌లో మాత్రం రాహుల్‌కు కీపింగ్‌ బాధ్యతలు ఇవ్వొద్దన్నాడు. వికెట్ల వెనకాల ఏ ఒ‍క్క చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని విన్నవించాడు. దీనిలో భాగంగా గతంలో భారత కీపర్‌గా చేసిన కిరణ్‌ మోరే ఉదంతాన్ని చోప్రా గుర్తు చేశాడు. రెగ్యులర్‌ కీపర్‌గా ఉన్న మోరే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో  సందీప్‌ శర్మ బౌలింగ్‌లో గ్రాహం గూచ్‌ క్యాచ్‌ను వదిలేస్తే అతను ట్రిపుల్‌ సెంచరీ(333) చేశాడన్నాడు. టెస్టుల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ఏ ఒ‍క్క అవకాశం ఇచ్చినా ఫలితం మారిపోతుందన్నాడు. (‘నేను కారు ప్రమాదంలో చనిపోలేదు’)

టెస్టు క్రికెట్‌లో కీపింగ్‌ అనేది ప్రధాన భూమిక పోషిస్తుందన్నాడు. ఒకవేళ క్యాచ్‌ వదిలేసినా, స్టంప్‌ ఔట్‌ను మిస్‌ చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. ఇక్కడ కీపర్‌ ద్వారానే ఎక్కువ తప్పులు జరుగుతాయని, ఆ నేపథ్యంలో రాహుల్‌ను కీపర్‌ కొనసాగించవద్దని విజ్ఞప్తి చేశాడు. కీపింగ్‌ అనేది ప్రత్యేకమైన జాబ్‌ అని, దానికి తాత్కాలిక కీపింగ్‌ అనేది సెట్‌ కాదన్నాడు. ఇక రాహుల్‌ పదే పదే తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చుకోవడాన్ని వదులుకోవాలన్నాడు. అటు ఓపెనర్‌గానో, ఇటు మిడిల్‌ ఆర్డర్‌లోనో కొనసాగాలి కానీ బహుముఖ పాత్రలు పోషిస్తే అది కెరీర్‌కే ప్రమాదం తెచ్చే అవకాశం ఉందన్నాడు. ఇప్పటికీ శిఖర్‌ ధావన్‌-రోహిత్‌ శర్మలే భారత రెగ్యులర్‌ ఓపెనర్ల అనే విషయాన్ని చోప్రా గుర్తు చేశాడు. దాంతో రాహుల్‌ను టెస్టుల్లో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా తీసుకోవడం కష్టమేనన్నాడు. 

పంత్‌కు అవకాశం ఇవ్వండి..

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌ కీపర్‌గా ఆకట్టుకోవడంతో స్పెషలిస్టు కీపరైన రిషభ్‌ పంత్‌ను పక్కకు కూర్చోబెట్టడం మంచి నిర్ణయం కాదన్నాడు. పంత్‌కు మరిన్ని అవకాశాలు ఇచ్చి చూడాలన్నాడు. అప్పటి వరకూ కీపర్‌గా రాహుల్‌ వెయిట్‌ చేయకతప్పదన్నాడు. ఇక్కడ రాహుల్‌ వెయిట్‌ చేయించాలి కానీ స్పెషలిస్టు కీపరైన పంత్‌ను కాదని చోప్రా తెలిపాడు. మరొకవైపు వృద్ధిమాన్‌ సాహాకు కూడా అవకాశాలు ఇవ్వకపోవడంపై చోప్రా విమర్శించాడు. అతను కీపర్‌గా ఏమైనా తప్పు చేశాడా అని నిలదీశాడు.(‘అతని వల్లే సచిన్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు