భారత్‌-అఫ్గాన్‌ల మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

14 Jun, 2018 14:06 IST|Sakshi

బెంగళూరు: భారత్‌-అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య ఇక్కడ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు ఆటలో భాగంగా లంచ్‌ తర్వాత భారత్‌ 45.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 248 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, మురళీ విజయ్‌లు ఆరంభించారు.

శిఖర్‌ ధావన్‌(107;96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించి భారత్‌ను పటిష్టస్థితికి తీసుకెళ్లాడు. అతనికి జతగా మురళీ విజయ్‌ కూడా రాణించడంతో భారత్‌ భారీ స్కోరుకు బాటలు వేసింది. వీరిద్దరూ 168 పరుగులు జోడించిన తర్వాత ధావన్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి మురళీ విజయ్‌(94 బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌(33 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు