రైనా తొలిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరం

13 Apr, 2018 01:25 IST|Sakshi

చెన్నై: టీమిండియాకు దూరమైనా... ఐపీఎల్‌ పది సీజన్లలో ఒక్క మ్యాచ్‌కు దూరం కాని రికార్డు సురేశ్‌ రైనాది. కానీ... గాయంతో ఈసారి రెండు మ్యాచ్‌లకు గైర్హాజర్‌ కానున్నాడు. కోల్‌కతాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కండరాల నొప్పితో సతమతమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌... తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో 15న పంజాబ్, 20న రాజస్తాన్‌లతో జరిగే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడని చెన్నై జట్టు వర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు