చెన్నైకి ఎదురుదెబ్బ..రెండు మ్యాచ్‌లకు రైనా దూరం

12 Apr, 2018 09:26 IST|Sakshi
సీఎస్‌కే ఆటగాడు సురేష్‌ రైనా(పాత చిత్రం)

సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌ మ‍్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పాయింట్ల లిస్టులో తొలిస్థానంలో ఉన్న చెన్నైసూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు సురేన్‌ రైనా గాయంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీంతో వచ్చే ఆదివారం(ఏప్రిల్‌ 15న) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌, ఏప్రిల్‌ 20న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లకు రైనా లేకుండానే సీఎస్‌కే బరిలోకి దిగుతుంది. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ వేసిన 10వ ఓవర్‌లో సింగిల్‌ తీసే సమయంలో రైనా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కాలి గాయానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో సీఎస్‌కే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే సీఎస్‌కే ఆటగాడు కేదార్‌ జాదవ్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా రైనా కూడా గాయపడటం సీఎస్‌కేకి పెద్ద ఎదురు దెబ్బే. చేతివేలి గాయంతో బాధపడుతున్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఆదివారం మ్యాచ్‌ నాటికి కోలుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్‌ సమయంలో గాయపడిన మురళీ విజయ్‌ ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయారు. తర్వాత కోలుకున్నా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. రైనా గాయపడటంతో ఆయన స్థానంలో మురళీ విజయ్‌కు ఆడే అవకాశం రావచ్చు.

మరిన్ని వార్తలు