రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం

29 Apr, 2015 22:00 IST|Sakshi
రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం

బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు నష్టానికి 200 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కి 201పరుగుల టార్గెట్ నిర్దేశించింది. డివిలియర్స్ (57), సర్ఫరాజ్ (45) నాటౌట్, మన్ దీప్ సింగ్ (27), దినేశ్ కార్తీక్ (27)

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 10పరుగుల వద్ద ఓపెనర్ క్రిస్ గేల్(10) వికెట్ తీసి టీమ్ సౌథీ బెంగళూరును దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని కేవలం ఒక్క పరుగుకే వెనక్కు పంపి బెంగళూరుకు కష్టాలు రెట్టింపుచేశాడు. గేల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విధ్వంసకర బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

మరో ఎండ్ లో మన్ దీప్ మొదట్లో ఆచితూచి ఆడుతూ ఏబీకి సహకరించాడు. పది ఓవర్లలో బెంగళూరు 83/2 తో పటిష్టస్థితిలో ఉన్నది. అయితే 93 పరుగుల వద్ద మన్ దీప్ సింగ్ (27) ఔటయ్యాడు. దీంతో వేగం పెంచిన డివిలియర్స్ వీలుచిక్కిన బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరును పెంచాడు. 13వ ఓవర్లో ఓ భారీ సిక్స్ తో 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 57 పరుగులు చేసిన ఏబీ రనౌటయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ 27 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. సర్ఫరాజ్ భారీ షాట్లతో రాజస్థాన్ ముందు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచాడు. 45 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా, కులకర్ణి, స్టువర్ట్ బిన్నీ చెరో వికెట్ పడగొట్టారు.

మరిన్ని వార్తలు