కేకేఆర్‌ గాడిలో పడేనా?

25 Apr, 2019 19:48 IST|Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా స్థానిక ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్తాన్‌​ రాయల్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచి రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పది మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రాజస్తాన్‌ రాయల్స్‌ పది మ్యాచ్‌లకు గాను మూడింట మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ రెండు జట్లు ఆరంభంలో విజయాలు సాధించినా ఆపై వరుస పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు వరుస విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్‌పై ఆశలు పెట్టుకోవచ్చు. ప్రధానంగా రాజస్తాన్‌ రాయల్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైతే ప్లేఆఫ్‌ దారులు మూసుకపోతాయి. మరొకవైపు కోల్‌కతా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి పాలు కావడంతో ఆ జట్టును కలవరపరుస్తోంది. ఆ జట్టులో ఆండ్రీ రసెల్‌ ఒక్కడే బ్యాటింగ్‌లో రాణిస్తుండటంతో ఆ జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. మరి తాజా మ్యాచ్‌లోనైనా సమిష్టగా రాణించి గాడిలో పడుతుందో లేదో చూడాలి.

కేకేఆర్‌
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, పీయూష్‌ చావ్లా, యర్రా పృథ్వీరాజ్‌, ప్రసీద్ధ్‌ కృష్ణ

రాజస్తాన్‌
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), అజింక్యా రహానే, సంజూ శాంసన్‌, బెన్‌ స్టోక్స్‌, రియాన్‌ పరాగ్‌, స్టువర్ట్‌ బిన్నీ, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, ఉనాద్కత్‌, ఓషాన్‌ థామస్‌, వరుణ్‌ అరోన్‌

>
మరిన్ని వార్తలు