పారా అథ్లెట్లకూ ‘ఖేల్ రత్న’

18 Sep, 2016 02:16 IST|Sakshi
పారా అథ్లెట్లకూ ‘ఖేల్ రత్న’

వచ్చే ఏడాది నుంచి అమలు 
కేంద్ర క్రీడల మంత్రి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్: దేశ అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అవార్డును ఇకపై పారాఅథ్లెట్లకూ అందజేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ వెల్లడించారు. నగరంలోని గోపీచంద్ అకాడమీకి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డు కోసం పారాలింపియన్ల పేర్లను పరిగణనలోకి తీసుకుంటామని  చెప్పారు.

రియో ఒలింపిక్స్‌పై సమీక్ష జరిపారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ...  ‘కేంద్రం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే కొత్త మార్గదర్శనంతో క్రీడలను ముందుకు తీసుకెళతాం. దీనిపై శ్రద్దపెట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని మంత్రి గోయెల్ అన్నారు. రియో ఒలింపిక్స్ ముగియగానే భారత క్రీడలపై లోతైన అధ్యయనం అవసరమని భావించినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు