రాజూస్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్లకు టైటిల్స్‌

3 Jun, 2018 10:30 IST|Sakshi

హైదరాబాద్‌: శ్రీలంకలో జరిగిన జూనియర్‌ చాలెంజ్‌ కప్, కొలంబో సెంట్రల్‌ సీనియర్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లలో రాజూస్‌ క్రికెట్‌ క్లబ్‌ జట్లు సత్తా చాటాయి. ఈ రెండు విభాగాల్లోనూ విజేతగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. కదిరిన క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన జూనియర్‌ చాలెంజ్‌ కప్‌ ఫైనల్లో రాజూస్‌ జట్టు 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. జూనియర్స్‌ విభాగంలో రుద్విక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’, అజయ్‌ ‘ఉత్తమ బ్యాట్స్‌మన్‌’, అక్షయ్‌ ‘ఉత్తమ బౌలర్‌’ పురస్కారాలను గెలుచుకున్నారు. సీనియర్స్‌ కేటగిరీలో కమల్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. మే 19 నుంచి 26 వరకు శ్రీలంకలో ఈ టోర్నీ జరిగింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా