టీమ్ స్పీడ్‌ను ఆదుకున్న రాకేశ్

5 Aug, 2016 10:47 IST|Sakshi

హైదరాబాద్: తడబడిన టీమ్ స్పీడ్ జట్టును రాకేశ్ యాదవ్ (56) అర్ధసెంచరీతో రాణించి ఆదుకున్నాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో శ్రీచక్రతో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమ్ స్పీడ్ 56.5 ఓవర్లలో 7 వికెట్లకు 103 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్ అబ్దుల్ ఖురేషీ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.


 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు


విశాక సీసీ: 92/7 (బాలాజీ సింగ్ 35; శ్రీకరణ్ 4/22), సాయిసత్యతో మ్యాచ్.
డెక్కన్ వాండరర్స్: 251/9 డిక్లేర్డ్ (అజీముద్దీన్ 48, భాస్కర్ 47; సత్యనారాయణ 5/46, నితీశ్ 3/61), ఉస్మానియా: 63/1.
న్యూబ్లూస్: 124/4 (భగత్ ప్రతాప్ 34, అబ్దుల్ ఆరిఫ్ 31, అకేందర్ 33 బ్యాటింగ్), అవర్స్ సీసీతో మ్యాచ్.
రోహిత్ ఎలెవన్: 133/3 (ఆరిఫ్ 59 బ్యాటింగ్, అంకుర్ 43), బ్రదర్స్ ఎలెవన్‌తో మ్యాచ్.
బడ్డింగ్ స్టార్స్: 138 (మణిదీప్ 3/12, సయ్యద్ అలీ 3/28), శ్రీశ్యామ్‌తో మ్యాచ్.
డెక్కన్ బ్లూస్: 118/4 (ఠాకూర్ హర్షవర్ధన్ 71), మహమూద్ సీసీతో మ్యాచ్.
అగర్వాల్ సీనియర్స్: 191 (మహేశ్ 51, అన్వేశ్ 4/63, వివేక్ 3/72), నిజామ్ కాలేజి: 149/2 (సాయిసందీప్ నాయుడు 73 బ్యాటింగ్, శరత్ 35 బ్యాటింగ్).
 గ్రీన్‌టర్ఫ్: 145/5 (అక్షయ్ 39, సయ్యద్ అస్కారి 45; సాయికుమార్ 4/52).

 


 

మరిన్ని వార్తలు