క్రికెట్ కు రమేశ్ పవార్ గుడ్ బై

10 Nov, 2015 18:12 IST|Sakshi
క్రికెట్ కు రమేశ్ పవార్ గుడ్ బై

న్యూఢిల్లీ: భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పవార్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ తో పాటు కాంపిటేటివ్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు. గత ఎనిమిది సంవత్సరాల క్రితం టీమిండియా జట్టులో చివరి సారి ఆడిన పవార్.. ఆ తరువాత దేశవాళీ మ్యాచ్ లు ఆడాడు. పవార్ తాజా నిర్ణయంతో  తన 15 ఏళ్ల దేశవాళీ మ్యాచ్ లకు ముగింపు పలికినట్లయ్యింది.   క్రికెట్ మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ లో పాల్గొనే ఉద్దేశం ఉన్నందునే తాను వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.


భారత క్రికెట్ జట్టు తరపున పవార్ రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. వన్డేలో 34 వికెట్లు తీయగా, టెస్టుల్లో ఆరు వికెట్లు తీశాడు. 2004 లో పాకిస్థాన్ తో రావల్పిండిలో జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన పవార్..తన చివరి వన్డేలో 2007లో ఆస్ట్రేలియాతో కొచ్చిలో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నాడు. పవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 146 మ్యాచ్ లు ఆడి 470 వికెట్లు తీశాడు. రంజీల్లో ముంబై తరపున ఆడిన పవార్.. 2008, 2010, 2012 సంవత్సరాల్లో ఐపీఎల్ టోర్నీల్లో కింగ్స్ పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించగా, 2011 లో కొచ్చి టస్కర్ తరపున ఆడాడు.

మరిన్ని వార్తలు