2011 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌ ఫిక్సయింది..!

14 Jul, 2017 20:18 IST|Sakshi


♦ 
శ్రీలంక మాజీ కెప్టెన్‌ రణతుంగ సంచలన వ్యాఖ్యలు
 
కొలంబో: 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ శ్రీలంక- భారత్‌ మ్యాచ్‌ ఫిక్సయిందని శ్రీలంక మాజీ క్రికెటర్‌ అర్జున్‌ రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్‌పై వెంటనే విచారణ చేపట్టాలని శ్రీలంక ప్రభుత్వాన్ని రణతుంగ శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఈ ఫైనల్‌ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన రణతుంగ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీనికి సంబంధించి ఓ వీడియోను రణతుంగ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ‘2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోవడం నిరాశ కలిగించింది. అప్పుడే నాకు ఈ మ్యాచ్‌ ఫిక్సయిందని అనుమానం నెలకొంది. ఇప్పుడు ఈ మ్యాచ్ పై పూర్తి విచారణ జరుపాలి’  అని రణతుంగ వీడియో పోస్టు చేశారు. 
 
ప్రస్తుతం ఎవరి పేర్లు చెప్పదల్చుకోలేదని ఏదో ఒకరోజు నిజం తెలుస్తుందని రణతుంగ తెలిపారు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో సంగక్కర కెప్టెన్సీలో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ తరువాత బ్యాటింగ్‌ దిగిన భారత్‌, ఓపెనర్లు సచిన్‌, సెహ్వాగ్‌ల వికెట్లు త్వరగా కోల్పోయింది. దీంతో శ్రీలంక విజం ఖాయం అనుకున్న సందర్భంలో శ్రీలంక చెత్త ఫీల్డీంగ్ బౌలింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఈ అంశాన్ని అప్పట్లో  శ్రీలంక లోకల్ మీడియా ప్రశ్నించినా అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు.
 
ఆరు సంవత్సరాల తర్వాత ఇదే అంశాన్ని అర్జున్‌ రణతుంగ లేవేనత్తడంతో శ్రీలంక క్రికెట్ లో కలకలం రేగింది. ఇంతటితో ఆగకుండా ఈ అంశాన్ని, శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాన్ని ప్రెసిడెంట్  మైత్రిపాల్ సిరిసేన, ప్రధాని రాణీ విక్రమ్ సింగ్ లకు ఫిర్యాదు చేస్తానని రణతుంగ పేర్కొన్నారు. ఇక రణతుంగ కెప్టెన్సీలో శ్రీలంక 1996 ప్రపంచకప్ గెలిచింది.
 
మరిన్ని వార్తలు