కబడ్డీ లీగ్‌లో హనీసింగ్ జట్టు

12 Jul, 2014 01:36 IST|Sakshi

 న్యూఢిల్లీ: ప్రపంచ కబడ్డీ లీగ్‌లోని ఓ జట్టును స్టార్ ర్యాపర్ యో యో హనీ సింగ్ కొనుగోలు చేశాడు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వివిధ దేశాల్లో ఈ లీగ్ జరగనుంది. ‘కబడ్డీ అంటే నాకు చాలా ఇష్టం. నేను బాగా నమ్మే క్రీడలో భాగస్వామినవుదామని అనుకున్నాను. అందుకే ప్రపంచ కబడ్డీ లీగ్‌లో జట్టును కొన్నాను.
 
 నా టీమ్‌కు టొరంటో ఆతిథ్యమిస్తుంది. జట్టుకు యో యో టైగర్స్ అని పేరు పెట్టాను’ అని ఈ పంజాబీ సింగర్ తెలిపాడు. ఇప్పటికే అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ కూడా ఈ లీగ్‌లో జట్లను కొన్నారు. మొత్తం పది జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో ఐదు నెలల పాటు 94 మ్యాచ్‌లు డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిన జరుగుతాయి.
 

మరిన్ని వార్తలు