ఇంగ్లండ్‌తో మ్యాచ్‌: కష్టాల్లో శ్రీలంక

21 Jun, 2019 17:14 IST|Sakshi

లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కష్టాల్లో పడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకేయులు 133 పరుగులకే ఐదు వికెట్ల కోల్పోయి ఎదురీదుతున్నారు. లంక ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే((1), కుశాల్‌ పెరీరా(2) తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌ జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 59 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆ తరుణంలో కుశాల్‌ మెండిస్‌-ఏంజెలా మాథ్యూస్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. కాగా, కుశాల్‌ మెండిస్‌(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, జీవన్‌ మెండిస్‌ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. ఆదిల్‌ రషీద్‌ వేసిన బంతికి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు