రషీద్ ఖాన్ హ్యాట్రిక్

7 Sep, 2017 13:05 IST|Sakshi
రషీద్ ఖాన్ హ్యాట్రిక్

ట్రినిడాడ్: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో అరంగేట్రం చేసిన అప్ఘానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అందరికీ సుపరిచితమే. సన్ రైజర్స్ హైదరాబాద్ రషీద్ ను రూ. 4 కోట్లకు వేలంలో కొనుగోలు చేయడంతో అతని పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంచితే,  ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో  అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న రషీద్ తన స్పిన్ మాయాజలంతో చెలరేగిపోతున్నారు.

 

డిఫెండింగ్ చాంపియన్ జమైకా తల్హాస్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ హ్యాట్రిక్ వికెట్లతో మెరిశాడు.తొలుత జమైకా జట్టు బ్యాటింగ్ కు దిగిన క్రమంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో రషీద్ విజృంభించాడు. 15 ఓవర్ మొదటి బంతికి మెక్ కార్తీ అవుట్ చేసిన రషీద్.. ఆపై వరుస రెండు బంతుల్లో జా ఫూ, రోవ్ మాన్ పావెల్ ను పెవిలియన్ కు పంపి హ్యాట్రిక్ ను నమోదు చేశాడు. ఈ మూడు వికెట్లను బౌల్డ్ రూపంలో రషీద్ ఖాతాలో చేరడం ఇక్కడ విశేషం.

ఈ మ్యాచ్ లో జమైకా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 168 పరుగులకు పరిమితం కాగా, ఆపై బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

మరిన్ని వార్తలు