మరోసారి మంచి మనసు చాటుకున్న రషీద్‌

26 May, 2018 08:52 IST|Sakshi

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మొత్తాన్ని విరాళం ఇచ్చిన యువకెరటం

సాక్షి, హైదరాబాద్‌ : రషీద్‌ ఖాన్‌ ఈ పేరు ఇప్పుడు ఐపీఎల్‌ ట్రెండింగ్‌లో మారుమోగుతోంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన రెండో ‍క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. అద్భుత ఆటతీరుతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా రషీద్‌ మాట్లాడుతూ బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో 100శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.

మ్యాచ్‌ అనంతరం రషీద్‌ ఖాన్‌ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా వచ్చిన 5లక్షల మొత్తాన్ని, గతవారం అఫ్గనిస్తాన్‌ జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. గతవారం జలాలాబాద్‌లో స్థానిక క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఇందులో ఆరుగురు పౌరులు మరణించగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన అనంతరం వచ్చిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడు, అతడి కుమారుడికి రషీద్‌ అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే.

క్రికెటర్ రషీద్.. పెద్ద మనసు ఇక్కడ చదవండి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు