సంచలన క్రికెటర్‌ ఇంట విషాదం

19 Jun, 2020 12:10 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్ యువ సంచలనం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. గతకొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న అతని తల్లి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను తన అభిమానులతో పంచుకుంటూ ట్విటర్‌లో రషీద్‌ భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. 'అమ్మా.. నువ్వే నా సర్వసం. నువ్వు లేకుండా నేను లేను. ఇక నాతో ఉండవనే విషయాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నా. నిన్ను చాలా మిస్సవుతానమ్మా. నీ ఆత్మకు శాంతికలగాలి'అంటూ రషీద్‌ ఉద్వేగభరిత ట్వీట్ చేశాడు. (అచ్చం స్మిత్‌ను దింపేశావ్‌గా..)

ఇటీవల తన తల్లి ఆరోగ్యపరిస్థితి పూర్తిగా క్షీణించిందని.. ఆమె కోసం ప్రార్థనలు చేయాలని అభిమానులకు, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. రషీద్‌ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. ఇక ఈ ఆఫ్గాన్‌ సంచలనం తన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. పొట్టిక్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున​ ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌ జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ అనతికాలంలోనే స్టార్‌ ఆటగాడిగా ఎదిగిపోయాడు. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు