తొలి క్రికెటర్‌గా రషీద్‌ ఖాన్‌

21 Oct, 2019 12:23 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ప‍్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ద హండ్రెడ్‌ లీగ్‌(వంద బంతుల క్రికెట్‌)లో తొలి క్రికెటర్‌గా అఫ్గానిస్తాన్‌ సంచలన రషీద్‌ ఖాన్‌ ఎంపికయ్యాడు. ఇటీవల ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లు పూర్తి కాగా, అందులో రషీద్‌ ఖాన్‌ను తొలి జాబితాలోనే మొదటి క్రికెటర్‌గా తీసుకున్నారు. టీ20ల్లో అద్భుతమైన గణాంకాలు ఉన్న రషీద్‌ ఖాన్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు తీసుకుంది. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం తనదైన మార్కు చూపెడుతున్న రషీద్‌ను ట్రెంట్‌ రాకెట్స్‌ ఎంచుకుంది.

మొదటి రౌండ్‌ జాబితా ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో వెస్టిండీస్‌ హిట్టర్‌ ఆండ్రూ రసెల్‌ను సౌథరన్‌ బ్రేవ్‌ తీసుకుంది. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ అరోన్‌ ఫించ్‌ నార్తరన్‌ సూపర్‌చార్జర్స్‌కు వెళ్లాడు. కాగా, వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ను ఏ జట్టు తీసుకోవడానికి ముందుకు రాలేదు. అతని కనీస ధర ఎక్కువగా ఉండటంతో గేల్‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. కాగా, దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌, శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగాలను కూడా తొలి రౌండ్‌లో ఎవరూ తీసుకోలేదు. తొలి రౌండ్‌లో ప్రతీ జట్టు కనీసం ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఇందులో ఎక్కువ మంది ఇంగ్లండ్‌ అంతర్జాతీయ ఆటగాళ్లను తీసుకోవడానికే ద హండ్రెడ్‌ ఫ్రాంచైజీలు మొగ్గుచూపాయి. ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, స్టీవ్‌ స్మిత్‌లను ద వెల్ష్‌ ఫైర్‌ తీసుకుంది. వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ ఓవల్‌ ఇన్విసబుల్‌ జట్టులోకి వచ్చాడు.  ఈ లీల్‌ వచ్చే ఏడాది జరుగనుంది.

మరిన్ని వార్తలు