'రవిశాస్త్రి హాట్ సీట్లో ఉండాలి'

5 Apr, 2016 12:22 IST|Sakshi
'రవిశాస్త్రి హాట్ సీట్లో ఉండాలి'

టీమిండియా డైరక్టర్గా రవిశాస్త్రి కొనసాగాలని పాకిస్తాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా డైర్టకర్గా రవిశాస్త్రి పదవీకాలం పూర్తయిందని, బీసీసీఐ అధికారులు కొత్త కోచ్ను నియమించేందుకు యోచిస్తున్నారని తెలిసింది. రవిశాస్త్రి సుముఖంగా ఉంటే ఆయన హాట్ సీట్లో కొనసాగాలి' అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. టి-20 ప్రపంచ కప్తో రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే.

టీమ్ డైరక్టర్గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాక జట్టులో ఆత్మస్థయిర్యాన్ని నింపాడని అక్రమ్ కితాబిచ్చాడు. టీమిండియాకు గతంలో విదేశీ కోచ్లు పనిచేశారని, డంకెన్ ఫ్లెచర్ కోచ్గా ఉన్నప్పడు భారత్ వరుసగా 8 టెస్టు మ్యాచ్లలో పరాజయం చవిచూసిందని గుర్తు చేశాడు. రవిశాస్త్రి వచ్చాక భారత్ మళ్లీ పుంజుకుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై టి-20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిందని చెప్పారు. బీసీసీఐ అధికారులు ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ, రవిశాస్త్రి పదవి నుంచి వైదొలిగితే విస్మయం చెందుతానని అక్రమ్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు