వైరల్‌ : కునుకు తీసిన రవిశాస్త్రి

22 Oct, 2019 08:35 IST|Sakshi

భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి పెవిలియన్‌ బాల్కనీలో కుర్చోని కునుకు తీశాడు. రవిశాస్రి వెనకాల ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ కోచ్‌ను అదేపనిగా ఆయన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు ఖాయం అనుకోని రవిశాస్త్రి ఓ కునుకు తీసినట్టు ఉన్నాడని కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. మరికొందరు మాత్రం ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

రవిశాస్త్రిది ప్రపంచంలోనే ఉత్తమమైన ఉద్యోగమని ఎందుకంటే.. పని సమయంలో కునుకు తీస్తున్న ఆయనకు కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. నిద్రపోవడానికి పది కోట్ల రూపాయలు చెల్లించాలా అని మరో నెటిజన్‌ ప్రశ్నించాడు.  

మరోవైపు పేసర్లు షమీ, ఉమేశ్‌ల విజృంభనతో.. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆ లాంఛనం పూర్తి చేసి.. సపారీలపై చారిత్రక విజయాన్ని ఖాతాలో వేసుకునేందుకు కోహ్లి సేన సిద్ధంగా ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా