ఆమే నా విమర్శకురాలు: రవిశాస్త్రి

6 Nov, 2019 15:47 IST|Sakshi

హైదరాబాద్‌ : టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి తన తల్లి లక్ష్మి శాస్త్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. బుధవారం రవిశాస్త్రి తల్లి లక్ష్మి 80వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రి తన తల్లి​కి బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ‘నా మార్గనిర్దేశకురాలు, అతి పెద్ద విమర్శకురాలు మా అమ్మే. హ్యపీ బర్త్‌డే మామ్‌. గాడ్‌ బ్లెస్‌ యూ’అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా తన తల్లితో దిగిన ఫోటోను కూడా జత చేశాడు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రి తల్లికి నెటిజన్లు కూడా బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. 

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఘోరపరాభావం అనంతరం.. టీమిండియా రాజ్‌కోట్‌ వేదికగా జరిగే రెండో టీ20 కోసం రవిశాస్త్రి పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే సిరీస్‌ బంగ్లా వశం కానుంది. అయితే తరువాతి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని రోహిత్‌ సేన ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే రాజ్‌కోట్‌ వేదికగా జరిగే రెండో టీ20కి తుఫాను ముప్పు ఉంది. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే దానిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా