అప్పుడు చురకలు.. ఇప్పుడు విషెస్!

23 Feb, 2018 19:58 IST|Sakshi

మ్యాచ్ ఫిక్సర్‌కు స్టార్ క్రికెటర్ విషెస్

ట్వీటర్ వార్‌కు తెరదించిన అశ్విన్

సాక్షి, స్పోర్ట్స్‌: ఇటీవల ఏదో జోక్ చేయబోయి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేతికి చిక్కి, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ నోరు కరుచుకున్న విషయం తెలిసిందే. కానీ వారం కూడా గడవకముందే వీరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడం, పరిస్థితుల్లో ఎంతో మార్పు రావడంతో క్రికెట్ అభిమానులు ఇది నమ్మలేకపోతున్నారు. నేడు గిబ్స్ జన్మదినం సందర్భంగా భారత బౌలర్ అశ్విన్ సఫారీ మాజీ ఆటగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.  'మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి గిబ్స్. ఈ ఏడాది నీకు కలిసిరావాలంటూ' అశ్విన్ ట్వీట్ చేశాడు. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ గిబ్స్ ట్వీట్ ద్వారా బదులిచ్చాడు. మ్యాచ్‌ ఫిక్సర్‌ను సైతం తమ క్రికెటర్ క్షమించి శుభాకాంక్షలు తెలిపాడని టీమిండియా క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గిబ్స్ ఫిక్సర్ అని తెలియక కొందరు అశ్విన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు.

అశ్విన్ వర్సెస్ గిబ్స్..
తన కొత్త షూ ప్రత్యేకతలు, పరుగెత్తడంలో ఉండే సౌకర్యం గురించి చెబుతూ అశ్విన్‌ ఒక షూ వీడియో ట్వీట్‌ చేశాడు. వికెట్ల మధ్య, అవుట్‌ ఫీల్డ్‌లో అశ్విన్‌ చురుగ్గా పరుగెత్తలేడనే అంశాన్ని గుర్తు చేసే విధంగా ‘ఇకనైనా నువ్వు మరింత వేగంగా పరుగెత్తగలవని ఆశిస్తున్నా’ అంటూ ఒకింత వ్యంగ్యంతో గిబ్స్‌ వ్యాఖ్య వదిలాడు. అయితే దీనిపై వెంటనే స్పందించిన అశ్విన్‌.. నాకు తిండి పెట్టే మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయకూడదనే నైతిక విలువలు పాటించడంలో మాత్రం చాలా అదృష్టవంతుడిని’ అని ఘాటుగా జవాబిచ్చాడు. దాంతో షాక్‌కు గురైన గిబ్స్‌... జోక్ చేశానని, దీన్ని ఇంతటితో వదిలేయమన్నాడు. తాను కూడా జోక్‌ చేశానని, నీతో కలసి డిన్నర్ చేస్తానని ట్వీట్ చేశాడు.

గిబ్స్ ఓ ఫిక్సర్
2000 ఏడాది భారత పర్యటనలో భాగంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో గిబ్స్‌ దోషిగా తేలి దాదాపు ఏడాదిపాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. తనకు 15000 డాలర్ల ఆఫర్ వచ్చిందని గిబ్స్ తన తప్పు ఒప్పుకున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

బౌండరీలు కూడా సమానమైతే?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హిమాన్షు, నమితలకు టైటిల్స్‌

ప్రణవ్‌ రామ్‌కు సింగిల్స్‌ టైటిల్‌

హీరో.. విలన్‌.. గప్టిలే!

ఇదొక చెత్త రూల్‌: గంభీర్‌

జీవితాంతం కేన్‌కు క్షమాపణలు చెప్తాను : స్టోక్స్‌

‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు

ఇంగ్లాండ్‌ అలా గెలిచిందట.!

జయహో జొకోవిచ్‌

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!