పోలీస్‌ బైక్‌ను ఢీకొట్టిన జడేజా భార్య కారు 

22 May, 2018 00:48 IST|Sakshi

ఆమె జుట్టు పట్టిన కానిస్టేబుల్‌  

జామ్‌నగర్‌: భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రీవా జడేజా కారు ప్రమాదవశాత్తూ కానిస్టేబుల్‌ బైక్‌ను స్వల్పంగా ఢీకొంది. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కానిస్టేబుల్‌ మాత్రం వీరంగం సృష్టించాడు. రీవాను జుట్టు పట్టిలాగి దుర్భాషలాడాడు.  ఈ ఘటన సరు సెక్షన్‌ రోడ్‌లో జరిగింది. ‘కారు ఢీకొట్టడంతో ఆగ్రహించిన కానిస్టేబుల్‌ జడేజా భార్యపై చేయిచేసుకొని దుర్భాషలాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సమాచారమందిన వెంటనే రీవాను తమ నివాసానికి పంపాం. వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జామ్‌నగర్‌ ఎస్పీ ప్రదీప్‌ వెల్లడించారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు