టిక్‌టాక్‌ బ్యాన్‌: వార్నర్‌ను ట్రోల్‌ చేసిన అశ్విన్‌‌

30 Jun, 2020 08:41 IST|Sakshi

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడంతో టిక్‌టాక్‌ స్టార్‌లపై ఫన్నీ మిమ్స్‌ క్రియోట్‌ చేస్తూ నెటిజన్‌లు ట్రోల్‌ చేస్తున్నారు. అదే విధంగా ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను  కూడా ఇండియన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ట్రోల్‌ చేస్తూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున్న భారత్‌ ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ను అశ్విన్‌ షేర్‌ చేస్తూ వార్నర్‌ను ట్యాగ్‌ చేశాడు. దీనికి ‘అప్పో అన్వర్‌?’ అంటూ కన్ను కొడుతున్న ఎమోజీని జత చేశాడు. (వార్నర్‌ ‘మైండ్‌ బ్లాక్‌’ అదిరింది కానీ..)

వార్నర్‌ను ట్రోల్‌ చేస్తూ చేసిన ఈ ట్వీట్ షేర్‌‌ చేసిన కొద్ది గంటల్లోనే 5 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. వార్నర్‌ బాధపుడుతున్న ఓ ఫొటోకు ‘ఒకేసారి ఫ్యాన్స్‌ను కోల్పోయినప్పుడు’, ‘ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను ఎప్పుడు నిషేధిస్తుందా అని వేయిటింగ్’ అంటూ ఫన్నీ మిమ్స్‌ షేర్‌ చేస్తు‍న్నారు. కాగా లాక్‌డౌన్‌లో‌ డేవిడ్‌ వార్నర్‌ తన భార్య పిల్లలతో కలిసి టాలీవుడ్‌, బాలీవుడ్‌ పాటలకు స్టెప్పులేసిన వీడియోలను షేర్‌ చేస్తుండేవాడు. అవి బాగా వైరల్‌ అవుతుండటంతో టిక్‌టాక్‌లో 4.8 ఫాలోవర్స్‌ను సంపాదించి వార్నర్‌ టిక్‌టాక్‌ స్టార్‌ కూడా అయ్యాడు. (వార్నర్‌ మరో టిక్‌టాక్‌.. ఈ సారి బాహుబలి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా