ఆర్సీబీకి చావో రేవో.. డివిలియర్స్‌ దూరం

19 Apr, 2019 19:46 IST|Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌ లీగ్‌ దశ దాదాపు సగం పూర్తయ్యింది. ఇప్పటికే ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే. ఈ క్రమంలో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌)తో చావో రేవో మ్యాచ్‌కు ఆర్‌సీబీ సిద్ధమైంది. మరోవైపు ఆరంభంలో వరుస విజయాలతో చెలరేగి ఒక దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్‌ ఆ తర్వాత హ్యాట్రిక్‌ ఓటములతో ఆరో స్థానానికి దిగజారింది. దీంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌ను గెలవడం ద్వారా తిరిగి విజయాల బాట పట్టాలని ఆ జట్టు కృతనిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇక కేకేఆర్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, ఆర్సీబీ రెండు మార్పులు చేసింది. ఆర్సీబీ తుది జట్టులోకి క్లాసెన్‌, స్టెయిన్‌లు వచ్చారు. ఏబీ డివిలియర్స్‌ స్థానంలో క్లాసెన్‌ జట్టులోకి రాగా, ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో స్టెయిన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఏబీ డివిలియర్స్‌ అస్వస్థతకు గురి కావడంతో రిస్క్‌ చేయడం ఇష్టం లేక అతన్ని పక్కకు పెట్టినట్లు కోహ్లి తెలిపాడు.

స్టెయిన్‌ రాకతో...
మరోవైపు బెంగళూరుకు ఇకపై అన్ని మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. పార్థీవ్, మొయిన్‌ అలీ మాత్రమే అడపాదడపా బ్యాట్‌ ఝళిపిస్తున్నారు. ఈ క్రమంలో వీరు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. అయితే, మరోవైపు బౌలర్లు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. ఫీల్డింగ్‌ సైతం ఘోరంగా ఉంది. ఈ క్రమంలో  జట్టులోకి దక్షిణాఫ్రికా స్పీడ్‌ గన్‌ స్టెయిన్‌ చేరడం ఆర్‌సీబీలో ఉత్సాహం నింపుతోంది. అలాగే ఆ జట్టు చహల్‌ స్పిన్‌లో మెరిస్తే బెంగళూరు గెలుపు పై ఆశలు పెట్టుకోవచ్చు.  

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్ధివ్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, స్టోయినిస్‌, క్లాసెన్‌, అక్షదీప్‌ నాథ్‌, పవన్‌ నేగీ, డేల్‌ స్టెయిన్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ షైనీ, యజ్వేంద్ర చహల్‌

కేకేఆర్‌
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, నితీష్‌ రాణా, రాబిన్‌ ఊతప్ప, ఆండ్రీ రసెల్‌, శుభ్‌మన్‌ గిల్‌, పీయూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసీద్ధ్‌ కృష్ణ, హారీ గర్నీ

>
మరిన్ని వార్తలు