ఎలాగైనా కప్ గెలవాలనే ఆరాటం..

13 Feb, 2015 13:30 IST|Sakshi
ఎలాగైనా కప్ గెలవాలనే ఆరాటం..

హైదరాబాద్: ప్రారంభ  వేడుకలు ముగిశాయి. అసలు పోరుకు రంగం సిద్ధమైంది. బరిలో దిగేందుకు పందెం కోళ్లు ఎదురు చూస్తున్నాయి.
ప్రపంచకప్లో పోటీ పడే జట్ల ఆశలను ఓసారి చూద్దాం.

*గెలిచిన కప్పును నిలబెట్టుకోవాలనే తపన భారత్ది..
* క్లెవ్ లాయిడ్ శకం మళ్ళీ రావాలనే కోరిక వెస్టిండీస్ది..
*  మళ్ళీ ఎలాగైనా కప్పు గెలవాలనే ఆరాటం ఆస్ట్రేలియాది..
*  రెండోసారి కప్పు గెలవాలనే పట్టుదల పాకిస్థాన్, శ్రీలంకలది..
* క్రికెట్ పుట్టింటిలో కప్ ఉండకపోతే ఎలా అనే తాపత్రయం ఇంగ్లాండ్ది..
* .. పోతే అనుభవమ్ము వచ్చు అన్న రీతిలో జింబాబ్వే, ఐర్లాండ్, బంగ్లాదేశ్..
* బలమైన జట్టుతో బరిలో ఉన్నాం.. గెలుపు మాదే అన్న ధీమా న్యూజిలాండ్ది..
* ప్రతీసారి గెలుపు ముంగిట్లో వెక్కిరిస్తున్న కప్ని సొంతం చేసుకోవాలని సౌతాఫ్రికా..
* బాంబుల మోతలను తలదన్నేలా అభిమానుల కేరింతల్ని అందుకోవాలనే చిరు ఆశ ఆఫ్ఘనిస్తాన్..ఈ విధంగా ప్రతి జట్టు పోరుకు సిద్ధమయింది.


నాలుగేళ్లకొకసారి పలకరించే ప్రపంచకప్ క్రికెట్ పండుగ. తమ జట్లమీద అపారమైన అభిమానం, నమ్మకం, గెలిచి తీరాలనే పట్టుదల, యుద్ధరంగాన్ని తలపించే ఉత్కంఠత, చప్పట్లు, ఈలలు, కేరింతలు, నిట్టూర్పుల సమ్మేళనం.. ఈ నెలన్నర రోజుల సంరంభాన్ని మీ 'సాక్షి'  వెబ్ సైట్ అనుక్షణం మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. నిరంతర అప్ డేట్స్, విశ్లేషణాత్మక వ్యాసాలు, అబ్బుర పరిచే ఫొటోలు, సరదా సరదా బిట్స్..  ప్లేయర్ల ఇష్టాయిష్టాలు, అలవాట్లు, నమ్మకాలతోపాటు వారి వారి నైపుణ్యాన్ని గణాంకాలతో మీకు అందిస్తుంది 'సాక్షి' వెబ్ సైట్.. రేపటినుంచి.. ఇక్కడే మీ క్రికెట్ పండగ.

-'సాక్షి' వెబ్ సైట్

మరిన్ని వార్తలు