ఫార్ములావన్లో యువ కెరటం

15 May, 2016 21:24 IST|Sakshi
ఫార్ములావన్లో యువ కెరటం

బార్సిలోనా: ప్రపంచ ఫార్ములావన్ చరిత్రలో ఓ యువ కెరటం దూసుకొచ్చింది ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిలో 18 ఏళ్ల మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్) విజేతగా అవతరించాడు. తద్వారా అత్యంత పిన్నవయసులో ఫార్ములావన్ టైటిల్ను కైవసం చేసుకున్న డ్రైవర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 66 ల్యాప్ల ప్రధాన రేసును  ఒక గంటా 41నిమిషాల 40.017సెకన్లలో పూర్తి చేసిన వెర్స్టాపెన్ అగ్రస్థానంలో నిలిచి తొలి ఫార్ములావన్ టైటిల్ ను అందుకున్నాడు.

 

ఈ రేసును తొలి రెండు స్థానాల నుంచి ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హమిల్టన్, నికో రోస్ బర్గ్లకు ఆదిలోనే చుక్కెదురైంది. మొదటి ల్యాప్లో ఇద్దరి కార్లు ఢీకొనడంతో వారు రేసు నుంచి వైదొలిగాల్సి వచ్చింది.  ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన హమిల్టన్ను రోస్ బర్గ్ అధిగమించాడు.  దీంతో ఆధిక్యంలోకి వెళ్లదామని హమిల్టన్ మరోసారి ప్రయత్నించే క్రమంలో రోస్ బర్గ్ కారును ఢీకొట్టాడు. దీంతో  వారిద్దరూ రేసు మధ్యలోనే వైదొలిగారు.  దీన్ని మ్యాక్స్ వెర్స్టాపెన్ సద్వినియోగం చేసుకుని విజేతగా నిలిచాడు. మాజీ ఫార్ములా వన్ డ్రైవర్ జాస్ వెర్స్టాపెన్ కుమారుడైన మ్యాక్స్ .. ఫార్ములావన్ టైటిల్ గెలిచిన తొలి డచ్ డ్రైవర్ గా  చరిత్ర సృష్టించడం మరో విశేషం.

మరిన్ని వార్తలు