‘అత్యుత్తమ గోల్‌ కంటే ఆమెతో సెక్స్‌ ఎంతో గొప్పది’

19 Sep, 2019 11:34 IST|Sakshi
రోడ్రిగ్యూజ్‌తో రొనాల్డో(ఫైల్‌ఫొటో)

లిస్బన్‌: పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఘనత క్రిస్టియోనో రొనాల్డోది. పోర్చుగల్‌కు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతతో పాటు ఆ జట్టు తరఫున అత్యధిక గోల్స్‌ సాధించిన రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్న రొనాల్డో. తన వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా షేర్‌ చేసుకున్న  దాఖలాలు లేవు.  అయితే రొనాల్లో ఖాతాలో ఎఫైర్లు కూడా బాగానే ఉన్నాయి.  గతంలో రష్యన్‌ మోడల్‌ ఇరినా షయక్‌తో ఐదేళ్లపాటు రిలేషన్‌లో ఉన్న రొనాల్డో ఇప్పటివరకూ ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. కాకపోతే ఆరుగురికి మాత్రం తండ్రి అయ్యాడు.  2010లో పుట్టిన కుమారునికి క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌ అని నామకరణం చేశాడు.  రొనాల్డో జూనియర్‌ తల్లి ఎవరు అనే విషయాన్ని గోప్యంగా ఉంచాడు రొనాల్డో. తనతో సహ జీవనం చేసిన ఆమెతో  అగ్రిమెంట్‌లో భాగంగనే రొనాల్డో అలా చేశాడు. ఆ తర్వాత కవల కూతుళ్లకు, కవల కుమారులకు జన్మనిచ్చాడు.  అయితే చాలాకాలంగా స్పెయిన్‌ మోడల్‌ జార్జినా రోడ్రిగ్యూజ్‌తో సహ జీవనం చేస్తున్న రొనాల్డోకు కూతురు జన్మించింది. ఆ రెండేళ్ల చిన్నారి పేరు అలానా మార్టినా.

కాగా, రోడ్రిగ్యూజ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు రొనాల్డో తాజా వెల్లడించాడు. ‘ఆమె నాకు ఎంతో సాయం చేసింది. ఆమెతో నేను ప్రేమలో ఉన్నా. ఏదో ఒకరోజు ఆమెను వివాహం చేసుకుంటా. మా తల్లి యొక్క డ్రీమ్ కూడా అదే. కాబట్టి ఏదో ఒకరోజు ఆమెను ఎందుకు వివాహం చేసుకోకూడదు?,  కెరీర్‌లో చేసిన ఉత్తమ గోల్‌ కన్నా తన ప్రేయసి రోడ్రిగ్యూజ్‌తో చేసిన శృంగారమే ఎంతో గొప్పది’ అని ఇంగ్లిష్‌ జర్నలిస్టు పీయర్స్‌ మోర్గాన్‌ చేసిన ఇంటర్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇక తన కెరీర్‌లో చేసిన అత్యుత్తమ గోల్స్‌ గురించి కూడా రొనాల్డో చెప్పుకొచ్చాడు. 2017-18 చాంపియన్‌  లీగ్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో డానీ కార్వెంజల్ పాస్ చేసిన బంతిని రొనాల్డో గోల్‌గా మలిచాడు. ‘ఓవర్‌హెడ్‌ గోల్‌ చేసేందుకు చాలా ఏళ్లు ప్రయత్నించాను. మాములుగా 700 గోల్స్‌ చేసుంటాను. కానీ ఎప్పుడూ దానిని చేయలేదు. జువెంటస్‌పై ఎట్టకేలకు గోల్ చేశానని అనుకున్నాను. ఆ తర్వాత గియానలుగిపై చేసిన ఆ గోల్‌ అత్యుత్తమైనదిగా గుర్తించాను’ అని రొనాల్డో పేర్కొన్నాడు. కాగా, ఈ గోల్‌ కంటే కూడా రోడ్రిగ్యూజ్‌తో సహ జీవనం చేయడం ఎంతో గొప్పదని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు