జీవరక్షణ వలయంలో ఆడటం కష్టమే: ద్రవిడ్‌ 

27 May, 2020 00:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవ రక్షణకు యోగ్యమైన వాతావరణంలో క్రికెట్‌ పునరుద్ధరణ కష్టమని భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ఇలా ఆడించాలనుకున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విధానం ఆచరణలో సాధ్యం కాదన్నాడు. జీవ రక్షణ వాతావరణంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జూలైలో సిరీస్‌లను నిర్వహిస్తామని ఇటీవల ఈసీబీ ప్రకటించింది. దీనిపై స్పందించిన ద్రవిడ్‌  ఇది సాధ్యం కాదన్నాడు. ‘నాకైతే ఈసీబీ చెప్పింది మిథ్యగా అనిపిస్తోంది. ఎందుకంటే మన క్రికెట్‌ క్యాలెండర్‌ ప్రకారం నిత్యం ప్రయాణాలు చేయాలి. చాలా మంది ఇందులో పాల్గొనాల్సి వస్తుంది. వైరస్‌ పరీక్షలు, క్వారంటైన్, వలయాన్ని ఏర్పాటు చేశాక కూడా టెస్టు రెండో రోజు ఎవరైనా కరోనా బారిన పడితే ఏం చేస్తారు? ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అందర్నీ క్వారంటైన్‌ చేయాల్సిందేగా. అప్పుడు మ్యాచ్‌ రద్దేగా! ఇలా కాకుండా ఆటగాడికి కరోనా సోకితే ఎలా ముందడుగు వేయాలని ప్రభుత్వ వర్గాలతో కలిసి పనిచేయాలి’ అని వివరించాడు.

>
మరిన్ని వార్తలు