ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఏ ఆటగాళ్లు?‌

4 Jan, 2018 21:15 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా అట్టిపెట్టుకున్న (రిటెయిన్‌)  ఇండియన్‌ ప్రీమియల్‌ లీగ్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ రిటెయిన్‌ పాలసీ 2018 నుంచి 2020 వరకు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది.  టీమిండియా అయినా... ఐపీఎల్‌ అయినా... కోహ్లి, ధోనీలే టాప్‌ స్టార్స్‌. అట్టిపెట్టుకునే అవకాశమే ఉన్నప్పుడు వీళ్లిద్దరినీ ఏ ఫ్రాంచైజీ అయినా ఎందుకు వదిలేస్తుంది. కాబట్టి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పంచనే విరాట్‌ కోహ్లి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) పెద్ద దిక్కుగా మహేంద్ర సింగ్‌ ధోని ఖాయమయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ రెండు జట్లు తమ రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకుని ఆడనున్న విషయం తెలిసిందే.   వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఏ ఏ ఫ్రాంచైజీ చేతిలో ఉన్నారంటే.. 


1.చెన్నై సూపర్‌ కింగ్స్‌: మహేంద్రసింగ్‌ ధోని, సురేశ్‌ రైనా, రవీంద్రజడేజా
2.రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్, సర్ఫరాజ్‌ఖాన్‌
3.రాజస్థాన్‌ రాయల్స్‌: స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా కెప్టెన్‌)
4.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్, భువనేశ్వర్‌ కుమార్‌(బౌలర్‌)
5.దిల్లీ డేర్‌డెవిల్స్‌: రిషబ్‌ పంత్, శ్రేయాస్‌ అయ్యర్‌, క్రిస్‌మోరీస్‌(దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌)
6.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రస్సెల్
7.కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: అక్షర్‌పటేల్‌
8.ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, బుమ్రా
జనవరి 27, 28వ తేదీల్లో జరిగే వేలంలో చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులోకి రానున్నారు. 

మరిన్ని వార్తలు