మండల స్పోర్ట్స్ అథారిటీలు ఏర్పాటు చేయండి

1 Aug, 2013 00:18 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మండలాల స్థాయిలో కూడా స్పోర్ట్స్ అథారిటీలను ఏర్పాటు చేయాలని ‘శాప్’ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ‘శాప్’ చట్టం ప్రకారం ఇందులో సభ్యులను నామినేట్ చేయాలని సూచించారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాలుగో సర్వ సభ్య సమావేశం జరిగింది. ఇందులో ‘శాప్’ ఉద్యోగులు, మాజీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
 
  రిటైర్మెంట్‌ల కారణంగా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఆర్ మొత్తాలను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సుదీర్ఘ పోరాటం కారణంగానే రిటైర్మెంట్ ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం రూ. 7.34 కోట్లు మంజూరు చేసిందని ఈ సందర్భంగా మాజీలు వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.వెంకట్రావు, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు