రియాజ్‌ గుడ్‌ బై చెప్పేశాడా?: ట్వీట్‌ కలకలం

13 Sep, 2019 12:29 IST|Sakshi

కరాచీ: ఇటీవల పాకిస్తాన్‌ క్రికెట్‌ ప్రధాన పేసర్‌ మహ్మద్‌ అమిర్‌ టెస్టు కెరీర్‌కు గుడ్‌ బై చెప్పిన సమయంలోనే వహాబ్‌ రియాజ్‌కు ఆ వరుసలోనే ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. ‘ నీ తర్వాత రియాజే టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నాడా’ అని ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ధ్వజమెత్తాడు. అసలే కష్టకాలంలో ఉన్న పాక్‌ క్రికెట్‌ జట్టుకు రిటైర్మెంట్‌లతో షాకిలివ్వడం తగదంటూ అక్తర్‌ విమర్శించాడు.  కాగా, ఇప్పుడు రియాజ్‌ చేసిన ట్వీట్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌ పెద్దల్లో అలజడి రేపుతోంది. తాను టెస్టు  క్రికెట్‌కు బ్రేక్‌ ఇవ్వనున్నట్లు రియాజ్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 

‘నేను నిరవధికంగా టెస్టు క్రికెట్‌కు బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నా. మా కుటుంబ సభ్యులు, బోర్డుతో చర్చించిన తర్వాత టెస్టులకు విరామం ఇవ్వడానికి సిద్ధమయ్యా.  నా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే క‍్రమంలోనే ఎర్ర బంతి క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టా.  ఇది చాలా కఠిన నిర్ణయమే. కానీ బోర్డు, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రియాజ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొన్నాడు.


 

మరిన్ని వార్తలు