విరాట్ పై అభిమానంతో..

26 Jul, 2016 15:37 IST|Sakshi
విరాట్ పై అభిమానంతో..

ఆంటిగ్వా:వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమానుల్లో ఇప్పుడు క్రికెట్ దిగ్గజ కుమారుడు వివియన్ రిచర్డ్స్ కుమారుడు మాలి రిచర్డ్స్ కూడా చేరిపోయాడు. స్వతహాగా తనకు కోహ్లి అంటే ఇష్టమని, ఆంటిగ్వాలో డబుల్ సెంచరీ చేయడంతో అతనిపై అభిమానం మరింత పెరిగిందన్నాడు. దీనిలో భాగంగా కోహ్లికి కోసం  ఓ పెయింటింగ్ను గీసినట్లు మాలి తెలిపాడు.

'ఆంటిగ్వాలో కోహ్లి డబుల్ సెంచరీ చేసిన అనంతరం ఏమైనా చేయాలని అనుకున్నా. అది కొద్ది ప్రత్యేకంగా ఉండాలని భావించా. కేవలం ఒక్క రోజులోనే విరాట్ పెయింటింగ్ గీశా. ఆ చిన్నకానుకను విరాట్కు అందించాలనే ఇక్కడకు వచ్చా'అని మాలి తెలిపాడు. ఇప్పటివరకూ 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన మాలి.. కోహ్లి బ్యాటింగ్పై ప్రశంసలు కురిపించాడు. తాను పెయింటింగ్ గీయడానికి అతని రికార్డు ఇన్నింగ్సే కారణమన్నాడు.  తన తండ్రి రిచర్డ్స్, వ్యాపార భాగస్వామి రోన్ హోవెల్తో కలిసి విరాట్కు ఆ బహుమతిని మాలి అందజేశాడు.

మరిన్ని వార్తలు